23-02-2025 07:58:03 PM
ఎండి మక్బుల్..
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భద్రాద్రి కొత్తగూడెం టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో, కలర్ బెల్ట్ ప్రమోషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం టైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండి మక్బూల్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ ఎండి సమియుద్దీన్, ఎండి అబ్దుల్ సలీం, గణిపాక మల్లేష్, సీనియర్ కోచస్ కన్నయ్య, లక్కినేపల్లి రమేష్ కుమార్, ఎస్.కె యాకూబ్ పాషా, ఎండి మీరావాలి పాషా, ఆర్గనైజర్ సెక్రెటరీ టి రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బెల్ట్ ప్రమోషన్ పొందిన పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం నందు టైక్వాండో ఒలంపిక్ ఐన ఈ క్రీడ మరింత ముందుకు పోయేలా, తామంతా ఎప్పుడూ ముందుంటామని భద్రాద్రి కొత్తగూడెంలో టైక్వాండో అభివృద్ధికి ఎప్పుడు కృషి చేస్తామని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వచ్చే సర్టిఫికెట్స్ వారికి ఉపయోగపడాలి అంటే గుర్తింపు పొందిన అసోసియేషన్లు నిర్వహించే క్రీడలలో మాత్రమే పాల్గొనాలని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆడవారికి సెల్ఫ్ డిఫెన్స్ చాలా ఉపయోగకరమని తెలిపారు.