- అన్ని వర్గాలు కాంగ్రెస్ చేతిలో మోసపోయాయి
- లగచర్లలో భూసేకరణ రద్దు చేసేవరకు పోరాడుతాం
- బీఆర్‌ఎస్ నేత కేటీఆర్
హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాం తి): అధికారంలో ఉన్నా.. లేకున్నా తాము ప్రజల కోసమే పనిచేస్తామని బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రూ పొందించిన షార్ట్ ఫిల్మ్, పాటను శనివారం విడుదల చేశారు.
అనంతరం ఆయన మా ట్లాడుతూ.. ఏడాది పాలనలో కాంగ్రెస్ చేసిన అవినీతిపై చేసిన పోరాటానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. రాష్ర్ట ప్ర భుత్వం హామీలను నిలబెట్టుకోలేక ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నదన్నారు. సమాజంలోని ప్రతి వర్గం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసానికి గురైందని విమర్శించారు.
రసమయి నిర్మించిన నమ్మి నానపోస్తే అనే షార్ట్ ప్రస్తుత తెలంగాణ పరిస్థితులకు అద్దం పట్టేలా ఉందన్నారు. లగచర్లలో భూసేకరణ రద్దయ్యే దాకా తమ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. వికారాబాద్ ఎస్పీతో టెలిఫోన్‌లో మాట్లాడి బాధితులపై పెట్టిన అక్రమ కేసులను నిలిపివేయాలని కోరారు.
తెలంగాణభవన్‌లో కలిసిన రాజన్న సిరిసిల్ల జిల్లా తాజా మాజీ సర్పంచులకు వారి సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం అంగన్‌వాడీలకు వేతనాలు పెంచి పదవీ విరమణ బెన్‌ఫిట్ ఇచ్చిందని..
వాటిని రేవంత్ సర్కార్ అమలు చేసేలా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. పార్టీ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్లు కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం రసమయి మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయం, మోసాలను ప్రతినెలా వివిధ రూపాల్లో గుర్తు చేస్తామన్నారు.