ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి
సంగాల రిజర్వాయర్ నుంచి నీటి విడుదల
గద్వాల(వనపర్తి), డిసెంబర్ 2 (విజయక్రాంతి): రైతులకు రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరును అందించాలనేదే ప్రభు త్వ లక్ష్యమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ సమీపంలోని సంగాల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు.