వరంగల్ ఎంపీ కావ్య
జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి): వచ్చే ఏడాది మార్చికల్లా కాజీ పేట ఫాతిమా బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేస్తామని వరంగల్ ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చారు. గురువారం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి బ్రిడ్జి నిర్మాణం కోసం తీసుకువచ్చిన మెటీరియల్‌ను పరిశీలించారు. బ్రిడ్జి స్లాబ్ నమూనా, రైల్వేట్రాక్‌పై నిర్మించే పనుల మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం కావ్య మాట్లాడుతూ.. కాజీపేటవాసులు ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి కోసం ఎదురుచూస్తున్నారని, మార్చికల్లా పనులు పూర్తి చేసి వినియోగంలోకి తెస్తామన్నారు.