- సీతారామా ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేస్తాం
- మంత్రి పొంగులేటి
పాలేరు, జూలై 2 (విజయక్రాంతి): రెండు నెలల్లో రైతు రుణమాఫీ చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం తిరుమాలాయపాలెం మండలంలో ని దమ్మాయిగూడెం, పోచారం గ్రామాల వద్ద సీతారామ ప్రాజెక్ట్‌లో భాగంగా సుమారు 9కిలోమీటర్లు మేర నిర్మించనున్న అండర్ టన్నెల్ పనులను పరిశీలించారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో పాలే రు నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు నెలల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రూప్ నుంచి గ్రూప్ వరకు నోటిఫికేషన్ ఇచ్చామని తెలిపారు. మెగా డీఎస్సీ ద్వారా 11,062 ఉద్యో గాలకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. వచ్చే రెండేళ్లలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి తమ ప్రభుత్వం ఉన్నదన్నారు.