గజ్వేల్ పత్తి మార్కెట్‌ను సందర్శించిన ఏఎంసీ పాలకమండలి
గజ్వేల్, అక్టోబర్ 30: గజ్వేల్‌లో నిరుపయోగంగా ఉన్న పత్తి మార్కెట్ యార్డుపై విజయక్రాంతి దినపత్రికలో ఈ నెల 25వ తేదీన ‘నిర్మించారు.. నిరుపయోగంగా వదిలేశారు’ అనే శీర్షి కన ప్రచురితమైన కథనానికి గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గం స్పందిం చింది. పత్తి మార్కెట్ యార్డును బుధవారం ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ సర్దార్‌ఖాన్, ఏఎంసీ కార్యదర్శి జాన్‌వెస్లీ, డైరెక్టర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మార్కెట్ యార్డు ప్రహరీ నిర్మాణం పూర్తి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేసి పత్తి మార్కెట్ యార్డును త్వరలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపడతామని తెలిపారు.