కొత్తపేట డివిజన్‌లో జోనల్ కమిషనర్ పర్యటన
ఎల్బీనగర్, జనవరి 18 : కొత్తపేట డివిజన్ నాగేశ్వర్ నగర్ కాలనీ, గాయత్రి పురం, శ్రీ రామలింగేశ్వర కాలనీ లో శనివారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ పాటిల్ కార్పొరేటర్ శ్రీ నాయికోటి పవన్ కుమార్ పర్యటించారు. కొత్తపేట డివిజన్ సమస్యలను కార్పొరేటర్ పవన్ కుమార్ వివరించారు. గాయత్రి పురం నుంచి శ్రీ రామలింగేశ్వర కాలనీ మీదుగా వెళుతున్న బాక్స్ డ్రైనేజీ లైన్ సగంలో ఆగిపోయిందని, వెంటనే బాక్స్ డ్రైనేజ్ పనులు పూర్తిచేసేలా చూడాలని జోనల్ కమిషనర్ ను కోరారు.
తెలంగాణ పార్క్ అభివృద్ధి పనులను హెచ్‌ఎండిఏ మధ్యలోనే ఆపివేశారని వివరించారు. కొత్తపేట్ డివిజన్ పరిధిలోని ఎస్బీహెచ్ కాలనీ, ఆర్బీఐ కాలనీ, భరత్ నగర్, బాలాజీ నగర్ కాలనీలో రోడ్డు మార్గాలు దెబ్బతిన్నాయని, వెంటనే రోడ్లను మంజూరు చేయాలని స్థానికులు కోరారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్ సుజాత, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్, డీఈ నవీన్ కుమార్, శానిటైజేషన్ డీఈ చందన, బుచ్చయ్య, ఆర్టికల్చర్ ఏఈ సత్యనారాయణ, ఎస్ ఎల్ ఆర్ కాలనీ అధ్యక్షుడు సుధాకర్, స్థానికులు సత్యనారాయణ, విజయభాస్కర్, రాకేశ్ యాదవ్, యాదయ్య ఉన్నారు.