* ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
ఆదిలాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి) : కాంగ్రెస్ పార్టీలో మాలల ఆధిపత్యం ఎక్కువ ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిరహించే వేల గొంతులు... లక్ష డప్పులు కార్యక్రమానికి సన్నాహకంగా ఆదిలాబాద్‌లో గురువారం నిరహించిన సభలో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు.
ఎస్సీ వర్గీకరణను సాధించేంతవరకు తమ పోరాటం ఆగదని అన్నారు. ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటున్న మాలల కుట్రలను మాదిగలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేశ్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదరి జిల్లపల్లి నవీన్ మాదిగ, గైకాడ్ సూర్యకాంత మాదిగ, బరుకొండ సుభాష్ మాదిగ, కూడల సామి మాదిగ, కామ్ల బాలాజీ మాదిగ తదితరులు పాల్గొన్నారు.