calender_icon.png 18 January, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయకపోతే ఉద్యమం చేపడుతాం

17-01-2025 10:59:46 PM

టిఎజిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రైతులందరికీ జనవరి 31 లోగా రుణమాఫీ చేయకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు అనంతరం రెవెన్యూ అధికారి లోకేశ్వర్ రావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆదివాసీ జిల్లాలో వ్యవసాయ అధికారుల వ్యవహార శైలి దారుణంగా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు రుణమాఫీ జిల్లాలో సక్రమంగా అమలు కాలేదని దీనికి ప్రధాన కారణం వ్యవసాయ అధికారులే అని విమర్శించారు. కొంతమంది రైతుల పేర్లను రికార్డుల నుండి తొలగించారని తద్వారా పేద రైతులకు ఆన్యాయం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మాల శ్రీ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి గణపతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కృష్ణ, డివైఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ శ్రావణి, ఉపాధ్యక్షులు పురుషోత్తం, సిపిఎం జిల్లా కార్యదర్శి  రాజన్న నాయకులు హనుమంతు, ఆనంద్, అనిత తదితరులు పాల్గొన్నారు.