calender_icon.png 4 November, 2024 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం

03-11-2024 01:35:02 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 2 (విజయక్రాంతి) : తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కారానికి కృషి చేస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎమ్ హుస్సేనీ ముజీబ్ అన్నారు. శనివారం టీఎన్జీవో పంచాయతీ కార్యదర్శుల రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక నిర్వహిం చారు.

ఎన్నికల అధికారిగా ఆదిలాబాద్ టీఎన్జీవో అధ్యక్షుడు ఎస్ అశోక్ వ్యవహ రించగా, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారా యణ గౌడ్ పరిశీలకులుగా వ్యవహరిం చారు. ఈ సందర్భంగా మొత్తం 38 మంది తో రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్ను కున్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్, ముజీబ్ మాట్లాడుతూ.. నూతన కార్యవర్గం ఉద్యోగుల ఆకాంక్షల మేరకు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో నూతన కార్యవర్గం అధ్యక్షుడు ఎస్ బలరాం, కార్యదర్శి పీ వెంకటరమణ, నగర శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్, బీ వెంకటేశ్, రాజీవ్‌రెడ్డి, పోలు రాజు, కొండల్ రెడ్డి, గోవర్దన్ రెడ్డి, రాజ్‌కుమార్, కురది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.