03-04-2025 12:40:10 AM
మంత్రి జూపల్లి
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఊరుకొండ పేట సామూహిక అత్యాచార ఘటనలో నిందితులపై కఠినంగా వ్యవహరిస్తామని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తో కలిసి ఉరుకొండ పేట ఘటనపై సమీక్ష జరిపారు వివాహితపై మానవ మృగాలుగా అత్యంత పాషవికంగా వ్యవహరించిన నిందితులను కఠినంగా శిక్షించేందుకు తగిన ఆధారాలన్నీ పోలీసు వ్యవస్థ సేకరించినట్లు తెలిపారు.
అవసరమైతే హైకోర్టు ఆదేశాల మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వీలైనంత త్వరగా శిక్షపడేలా ఛార్జ్ సీట్ వేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధాన పట్టణ కేంద్రాలు ఆలయాలు జన సమూహ ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో సిసి కెమెరా నిగ పెంచుతామన్నారు.