calender_icon.png 19 November, 2024 | 4:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం

19-11-2024 01:44:45 PM

కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్లో పర్యటించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్ కార్పోరేటర్ బొంతు శ్రీదేవి 

కాప్రా (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ పరిధిలోని స్మశాన వాటిక సమస్యతో పాటు ప్రధాన సమస్యల పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ హేమంత్ కుమార్ పాటిల్, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిలు పాల్గొన్నారు. డివిజన్ పరిధిలోని చర్లపల్లి స్మశాన వాటికను పరిశీలించిన అనంతరం ముంపు ప్రాంతాలైన వీఎన్.రెడ్డి నగర్, సాయి నగర్, కృష్ణ నగర్ తదితర ప్రాంతాల్లో డిప్యూటీ కమిషనర్ జగన్, వివిధ విభాగాల అధికారులతో కలిసి వారు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డివిజన్ పరిధిలోని స్మశాన వాటికలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించి త్వరగాతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

హిందూ, ముస్లిం, క్రిస్టియన్ స్మశాన వాటికలను మోడ్రన్ స్మశాన వాటీకాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అదే విధంగా ముంపు ప్రాంతాలలో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు. డివిజన్లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు నిధులు కేటాయించనున్నట్లు వారు తెలిపారు. అనంతరం పలు కాలనీలలో నెలకొన్న సమస్యలను స్థానికులను వారు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగేందర్, డిఈ బాలకృష్ణ ఏఈ స్వరూప, మేడ్చల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాగిళ్ల బాల్రెడ్డి, నాయకులు బొడిగే ప్రభు గౌడ్, సానేం రాజు గౌడ్, పాండు ముదిరాజ్, విజయ్, అశోక్, వెంకట్ రెడ్డి, సర్కిల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.