* ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్, ఫిబ్రవరి 5: గాజాను స్వాధీ నం చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్రంప్ ప్ర కటించారు. సెక్యూరిటీ కోసం గాజాలో అ మెరికా బలగాలను మోహరించే అవకాశం ఉందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ట్ర ంప్ బదులిస్తూ.. పాలస్తీనియన్లు మరోచోట స్థిరపడిన తర్వాత యుద్ధంతో దెబ్బతిన్నగా జాను తమ దేశం స్వాధీనం చేసుకుటుందని వెల్లడించారు. ట్రంప్ ప్రకటనను హమాస్ ఖండించింది. ట్రంప్ ప్రకటన చరిత్రను మా రుస్తుందని నెతన్యాహూ అభిప్రాయపడ్డారు.
నా జోలికొస్తే ఖతమే..
ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తీసుకొచ్చేలా కఠిన విధానాల అమలుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఒకవేళ ఇరాన్ గనక తనను చంపాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే. నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేసేలా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చా. అక్కడ ఏమీ మిగలదు’ అని పేర్కొన్నారు.