calender_icon.png 14 April, 2025 | 10:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాద నివారణకు చర్యలు చేపడతాం

28-03-2025 12:50:25 AM

చారకొండ మార్చి 27: కోదాడ- జడ్చర్ల జాతీయ రహదారి చారకొండ మండలంలోని మర్రిపల్లి , సారం బండతండా వద్ద మలుపులను ఎన్ హెచ్ డి ఈ రమేష్ , ఎస్త్స్ర శంషుద్దీన్ తో  కలిసి పరిశీలించారు  జాతీయ రహదారిపై మూల మలుపుల వద్ద ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు.

అదేవిధంగా మర్రిపల్లి, చారకొండ రహదారిపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రమాద నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు.  వారి వెంట  మర్రిపల్లి మాజీ సర్పంచ్ నరేష్ నాయక్, ఎన్ హెచ్ ఏ ఈ కరుణాకర్, హెడ్ కానిస్టేబుల్ నాగయ్య ఉన్నారు.