22-04-2025 05:55:31 PM
హైదరాబాద్: 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవానికి లగచర్ల గ్రామానికి చెందిన మహిళలు విరాళం ఇవ్వడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్(Telangana Bhavan) లో కేటీఆర్ మాట్లాడుతూ.. కొందరు పోలీసులు మహిళలపై అసభ్యంగా ప్రవర్తించారని, రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సర్కార్ వ్యవహార శైలిని ఎన్‌హెచ్‌ఆర్‌సీ తప్పుపట్టిందని తెలిపారు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ నివేదిక తర్వాతైనా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలన్నారు.
పోలీసుల తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ తీవ్రంగా తప్పుపట్టిందని, బాధ్యులైన పోలీసులను సర్వీసు నుంచి తొలగించాలని ఆయన వెల్లడించారు. బాధ్యులైన పోలీసులను తొలగించకపోతే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని, సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. హైకోర్టు స్టే ఇచ్చినా భూసేకరణ చేస్తున్నారని.. దానిని వెంటనే నిలిపివేయాలని, మూడేళ్లలో మా పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమ వ్యక్తం చేశారు. అతి చేసే అధికారులపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని కేటీఆర్ సూచించారు.