calender_icon.png 23 February, 2025 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యారాజకీయాలను ఉక్కుపాదంతో అణచివేస్తాం

22-02-2025 12:53:44 AM

మంత్రి శ్రీధర్‌బాబు

కరీంనగర్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి): భూపాలపల్లి హత్య ఘటనపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఫైరయ్యారు. రాష్ట్రంలో హత్యారాజకీయాలను ఉక్కుపాదంతో అణిచివేస్తామని పేర్కొన్నారు. శుక్ర వారం కరీంనగర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ‘విజయక్రాంతి’తో మాట్లాడారు.

విచారణలో దోషులెంతటివారైనా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో గత ప్రభుత్వం వారి పార్టీకి చెందిన నాయకులను కాపాడే ప్రయత్నాలు చేసిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో నూ హత్యా రాజకీయాలకు పాల్పడతామంటే ఊరుకోబోమని స్పష్టం చేశారు. నిందితులు చట్టప్రకారం శిక్ష అనుభవించక తప్పదని పేర్కొన్నా రు.

కృష్ణా జలాలపై  తెలంగాణా ప్ర భుత్వం పోరాటం కొనసాగిస్తుందని, రాజీపడే ప్రసక్తే లేదన్నారు. గత ప్రభుత్వం రాజీపడటంతోనే తెలంగాణకు న్యాయమైన వాటా దక్కలేదని తెలిపారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ పార్టీదేనని ధీమా వ్యక్తం చేశారు. విద్యా వంతుడైన నరేందర్‌రెడ్డిపై ప్రతిపక్షాలు బురదజల్లే యత్నం చేస్తు న్నాయని ఆరోపించారు.