- ఏ ఒక్కరు మనోధైర్యం కోల్పోవద్దు
- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ
- హుజూర్‌నగర్‌లో చెరువులు, కాల్వల పరిశీలన
- హుజూర్‌నగర్ ఏఈని సస్పెండ్ చేయాలని ఆదేశం
సూర్యాపేట, సెప్టెంబర్ 3: వరదలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ నియోజకవర్గంలోని హుజూర్‌నగర్, మఠంపల్లి మండలాల్లో దెబ్బతిన్న చెరు వులు, కాలువలు, ముంపునకు గురైన పంట పొలాలు, దెబ్బతిన్న ఇళ్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రాష్ట్రం మొత్తంలో అత్యధిక వర్షపాతం హుజూర్‌నగ ర్ నియోజకవర్గంలోనే నమోదైందన్నారు. దీ ంతో పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని చెప్పారు.
వరదల్లో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రూ.5 లక్షలు, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల ఆర్థిక సాయమందిచనున్నట్లు తెలిపారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ.10 వేలు, పూర్తిగా దెబ్బతి న్న ఇళ్లకు ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగం గా గృహాలు నిర్మించి ఇస్తామన్నారు. మరణించిన పశువులకు ఒక్కోదా నికి రూ.50 వేల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. వర్ష బీభత్సం వలన నష్ట పోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఏ ఒక్కరు మనోధైర్యం కోల్పోవద్దన్నారు.
అనంతరం పట్టణంలోని దద్దనాల చెరువు, బూరుగడ్డలోని నల్లచెరువు, మఠంపల్లి మండలంలోని ముంపునకు గురైన గ్రామాలను పరిశీలించారు. దెబ్బతిన్న చెరువులు, బ్రిడ్జిలు, రోడ్ల పునరుద్ధరణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడు తున్నట్లు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. కాగా హుజూర్‌నగర పట్టణంలోని మినీ ట్యా ంక్‌బండ్ త ప్పుడు ప్రణాళికతో నిర్మించడం తో వరదలకు కారణమైనదని, ప్రణాళిక రూ పొందించిన ఇరిగేషన్ ఏఈ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వెయ్యి ఎకరాల్లో దెబ్బతిన్న సోయా
నిజామాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మహారాష్ట్ర నుంచి గోదావరికి పెద్ద ఎత్తున వస్తున్న వరదతో నిజామాబాద్ జిల్లాలో వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. బోధన్ రెవె న్యు డివిజన్‌లో గోదవరి నదికి ఇరువైపు లా ఉన్న పంటలను వరద నీరు ముంచెత్తడంతో దాదాపు వెయ్యిఎకరాల్లో పంట పొలాలు దెబ్బతిన్నాయి. బోధన్ మండ లం బిక్నెల్లి, హంగర్గా గ్రామాల పరిధిలో వెయ్యి ఎ కరాల్లో సోయ పంట నీట మునిగింది. అధికారులు తమను ఆదు కోవాలని రైతులు కోరుతున్నారు.