- అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
- ధరూరు మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
వికారాబాద్, జనవరి 18: రైతులు నిరాశ పడకుండా అన్ని విధాలుగా ఆదుకుంటా మని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం దారూర్ మండలంలోని కుక్కింద, నాగరం, దొర్నాల్ ల, స్టేషన్ దారూర్ , వ్యవసాయ మార్కెట్, తరిగోపుల గ్రామాల్లో నూతనంగా వేసిన సి.సి. రోడ్లను సభాపతి ప్రారంభించారు. అదేవిధంగా ఆర్థిక సంఘం, డిఎంఎఫ్టి లు సంయుక్తంగా రూ. 25 లక్షల 50 వేల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర ( పల్లే దవాఖాన ) భవనాన్ని సభాపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశాల్లో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ.... ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు రెండు లక్షల రుణమాఫీని చేయడం జరిగిందని, కొందరు రైతులకు సాంకేతిక లోపం వల్ల, ఇతరత్ర కారణాలవల్ల రుణమాఫీ కానీ వారికి రుణమాఫీ ని వర్తింప చేస్తామని ఆయన తెలిపారు. జనవరి 26 నుండి రైతు భరోసలో భాగంగా 12 వేల రూపాయలను రైతు ఖాతాలోకి జమ అవుతుందని ఆయన అన్నారు.
భూమిలేని నిరుపేదలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గానికి 12 వేల ఇండ్లు మంజూరయ్యాయనిఇండ్లు లేని, బండల ఇల్లు కలిగిన అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రేషన్ కార్డుల నిమిత్తం గ్రామాల్లో సర్వే నిర్వహించనున్నామని, తెలిపారు.
కోట్ పల్లి ప్రాజెక్టుకు 120 కోట్లు మంజూరు అయ్యాయని, ఈ నిధుల ద్వారా చెరువులో, కాలువల, చెక్ డ్యాంల మరమ్మత్తులు చేపడుతున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిం చేందుకు జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నట్లు సభాపతి తెలిపారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి మల్లేశం, పంచాయతీరాజ్ ఇఇ ఉమేష్, తహసిల్దార్ సాజిదా బేగం, ఎంపీడీవో నర్సింలు పాల్గొన్నారు.