calender_icon.png 8 January, 2025 | 5:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను అన్ని విధాల ఆదుకుంటాం

06-01-2025 08:14:39 PM

సాగు భూమి ఎకరాకి 12,000 

భూమిలేని వారికి ఏడాదికి 12,000 

ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నారు 

బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి...

నిజామాబాద్ (విజయక్రాంతి): రైతులకు అనుకూలంగా రైతులను అన్ని విధాలు ఆదుకునే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని సాగు చేసే రైతుకి ఎకరాకు 12000 భూమిలేని వారికి సంవత్సరానికి 12,000 వేల రూపాయలను తమ ప్రభుత్వం ఇస్తుందని మాజీ మంత్రి భోగం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) తెలిపారు. సోమవారం రోజు జిల్లా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ గగ్గోలు పెడుతున్నారని సుదర్శన్ రెడ్డి పండించే రైతులకు రెండు పంటలలో ప్రతి క్వింటాలకు బోనస్ ఇస్తున్నామన్నారు. ఇల్లు లేని వారికి నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఈనెల 26 నుండి అందిస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సుదర్శన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమ ఉనికి ప్రమాదం ఏర్పడుతున్న దాని తెలిసి కేటీఆర్ అదుపు తప్పి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన తెలిపారు. కేసిఆర్ పాలనలో ప్రభుత్వ పనితీరు అస్తవ్యస్తంగా మారిందని ఒక్కో వ్యవస్థను సవరిస్తూ గాడిలో పెడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు.

రైతులను అన్ని విధాల ఆదుకొని వారికి అండగా ఉంటామని ఆరు గ్యారెంటీల సంక్షేమాన్ని అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజల్లో ఆనంద ఉత్సవాలు కనిపిస్తున్నాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనిపించకుండా పోతామనే భయంతో ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్హౌందన్ కూడా చైర్మన్ కేశవేణు గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంత రెడ్డి రాజిరెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్ ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్ సేవాదళ్ సంతోష్ బొబ్బులి రామకృష్ణ ఈసా అబ్దుల్ అజాజ్ అపర్ణ తదితరులు పాల్గొన్నారు.