11-03-2025 12:00:00 AM
ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాల, మార్చి 10 (విజయక్రాంతి) : మరణించిన పోలీసు కుటుంబాలకు పోలీస్ యంత్రాంగం అండగా ఉండి ఆదుకుంటుందని జిల్లా ఎస్పీ అశోక్’కుమార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం కంట్రోల్ రూమ్’లో హెడ్ కానిస్టేబుల్’గా విధులు నిర్వహిస్తున్న రమణ గుండె పోటుతో మరణించగా, వారి కుటుంబానికి పోలీస్ భద్రత పథకం, కార్పస్ ఫండ్ కింద మంజూరైన రూ. 7 లక్షల 56 వేలకు సంబంధించిన రెండు చెక్కులను సోమవారం రమణ భార్య, కుమారునికి అందజేశారు.
రమణ కుటుంబానికి ప్రభుత్వం తరుపున అందాల్సిన బకాయిలను త్వరితగతిన అందజేసే విధం గా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సూచించారు. ఏదైనా సమస్య వస్తే నేరుగా తనను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ శశికళ, సూపర్‌ఇండెంట్ నయీమ్, జూనియర్ అసిస్టెంట్ నర్సయ్య పాల్గొన్నారు.