calender_icon.png 27 December, 2024 | 4:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఎంఎస్‌ఎంఈ’ అభివృద్ధికి మద్దతిస్తాం

27-12-2024 01:15:09 AM

యూనియన్ బ్యాంక్ చీఫ్ జీఎం కరె భాస్కర్‌రావు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 26 (విజయక్రాంతి):  సూక్ష్మ, చిన్న, మధ్య తర హా సంస్థల(ఎంఎస్‌ఎంఈ) అభివృద్ధికి పూ ర్తి మద్దతు ఇస్తామని యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్, హైదరాబాద్ జోన్ హెడ్ కరే భాస్కర్‌రావు తెలిపారు. సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయంలో ‘యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ ‘ఎంఎస్‌ఎంఈ’ అవుట్‌రీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహిం చగా.. భాస్కర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో 50 మంది ఎం ఎస్‌ఎంఈ కస్టమర్లు పాల్గొని, బ్యాంక్ సీనియర్ అధికారులతో ఆర్థిక సహాయం, అభి వృద్ధి అవకాశాలపై చర్చించారు. అనంతరం బ్యాంక్ ఆర్థిక పురోగతిపై ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తూ రూ.400 కోట్ల రుణాలను మంజూరు చేసి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కరే భాస్కర్‌రావు మాట్లాడుతూ.. తమ బ్యాంక్ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధికి అనుకూలమైన ఆర్థిక పరిష్కారాలు, క్రెడిట్ సహాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడంపై బ్యాంక్ దృష్టిని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్, హైదరాబాద్,  సైఫాబాద్ ప్రాంతీయ కార్యాలయం హెడ్ సోనాలిక, డిప్యూటీ ప్రాంతీయ హెడ్‌లు  జగదీశ్ లేపాక్షి, రవి మారం, సీజీ,  ఎంఎస్‌ఎంఈ లోన్ పాయింట్ హెడ్  సుబ్రమణ్యం పాల్గొన్నారు.