22-04-2025 01:32:20 AM
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్, ఏప్రిల్ 21 :ఈనెల 27న వరంగల్ లో జరగబోయే బీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావాలని జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్యరావు అన్నారు. సోమవారం జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం వాసవి కళ్యాణ మండపంలో ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ గతంలో ఎన్ని లేని విధంగా కార్యకర్తలు ఈ సమావేశానికి వస్తున్నట్లు అంచనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎవరైతే సమావేశం వెళ్తారో వారికి ఇంటి వరకు తెచ్చే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని ఆయన సూచించారు కార్యకర్తలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తాము కార్యకర్తలను అన్ని విధాల ఆదుకుంటామని పేర్కొన్నారు.
కార్యకర్తలకు వచ్చిపోయే మార్గమధ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నీరు, భోజన వసతి కల్పిస్తామని డిసిఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్ అన్నారు. కార్యకర్తలు అందరూ సమయానికి చేరుకొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.
వచ్చే ఏ ఎన్నికలైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఝరాసంగం మండల కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నాయకులను సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వార్డ్ మెంబర్గా కౌన్సిలర్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఝరాసంగం, జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, మగడంపల్లి పార్టీల అధ్యక్షులు వెంకటేశం, నరసింహులు, తట్టు నారాయణ, సంజీవరెడ్డి లతోపాటు ఝరాసంగం ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలుపాల్గొన్నారు.