calender_icon.png 27 February, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం

27-02-2025 01:23:13 AM

కోదాడ, ఫిబ్రవరి 26: కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు రఘు మృతి తీవ్రంగా కలిసి వేసిందని సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం రఘు పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ. ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడ కూడా చేపట్టినటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను రఘు సారధ్యంలో చేపట్టి విజయవంతం చేశారని గుర్తు చేశారు. ఆదేశాలు ఇచ్చిన ప్రతి పనిని 100 శాతం విజయవంతం చేసేవాడని , మంచి జర్నలిస్టు మిత్రుని కోల్పోయామని ఆవేదన చెందారు.

వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని , ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. భవిష్యత్తులో రఘు ఆశయాలను నెరవేర్చినందుకు తప్పనిసరిగా ముందుంటానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కోదాడ నియోజకవర్గ ప్రింట్@ ఎలక్ట్రానిక్ జర్నలిస్టు సభ్యులు ఉన్నారు.