29-04-2025 12:00:00 AM
ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పోలీసు శాఖలో సేవలందించి మరణించిన పోలీస్ కుటుంబాలకు ఎల్లప్పు డూ పోలీస్ శాఖ అండగా నిలుస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు అన్నారు. జిల్లాలోని ఈస్ గాం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కాని స్టేబుల్ గా విధులు నిర్వహిస్తు ఇటీవల గుం డెపోటుతో మరణించిన ఎం.డి బషీరుద్దీన్ కుటుంబానికి పోలీసు శాఖ నుంచి మంజూ రైన భద్రత ఎక్స్‌గ్రేషియా రూ.8 లక్షల చెక్కు ను ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సోమవారం మృతుని భార్య గోరిబేగంకు అందజేశా రు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో సేవలందించి మరణించిన వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అం దాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని అన్నారు. ఈ కార్యక్ర మంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్‌రెడ్డి, ఆర్.ఐలు పెద్దన్న, అంజ న్న, నాగుల్ మీరా, ఎ.ఓ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వర్మ తదితరులు ఉన్నారు.