calender_icon.png 21 April, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటాం

12-04-2025 12:18:01 AM

ఎమ్మెల్యే అనిల్ కుమార్‌రెడ్డి 

యాదాద్రి భువనగిరి ఏప్రిల్ 11 ( విజయక్రాంతి ): అనాధ పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని దానికి అనుకూలంగా బాలసదన భవనం నిర్మించుకుంటున్నామని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు.

శుక్రవారం భువనగిరి బై పాస్ రోడ్ సింగన్నగూడెం  ఎస్టి పోస్ట్ మెట్రిక్   హాస్టల్ చౌరస్తా సముదాయం పక్కన దాదాపు 1 కోటి 34 లక్షల అంచనాతో బాలసదనం భవనాన్ని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేజ్ చిస్తి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా భువనగిరి శాసనసభ్యులు మాట్లాడుతూ భవన నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో పనులు చేపట్టాలని, నిర్మాణ పనులు.

 6 నెలల వ్యవధిలో  పూర్తిచేసి 6 నుండి 18 సంవత్సరాల లోపు  వయసు అనాధ, పాక్షిక పిల్లలకు ఉపయోగపడేలా భవనం అందంగా తీర్చిదిద్దాలని, త్వరతగతిన పనులు పూర్తి చేసి  అందించాలన్నారు. భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, మున్సిపల్ కమిషనర్ రాజలింగం ఏసిడి పిఓరమ, బీ ఆర్ బీ కోఆర్డినేటర్ అనంతలక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.