22-02-2025 12:00:00 AM
నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్
ఖానాపూర్, ఫిబ్రవరి 21 ః నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పెంబి మండలం రాయదారి గ్రామంలో గురువారం సంభవించిన అగ్నిప్రమాద బాధితులను ఆదుకుంటామని నిర్మల్ జిల్లా, కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఆమె శుక్రవారం బాధితులతో ప్రమాదానికి గురైన ఇండ్ల ప్రదేశాన్ని పరిశీలించారు.
బాధితులతో కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఘటనలో 8 ఇండ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, బాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తక్షణ సహాయం కింద బాధితుల ఖాతాల్లోకి లక్ష రూపాయలు జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, మండల ప్రత్యేక అధికారి నర్సింహారెడ్డి, డిఎస్‌ఓ కిరణ్ కుమార్, తాసిల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో రమాకాంత్ ఉన్నారు.
ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్..
నిర్మల్ జిల్లా మామడ మండలంలోని రాసి మెట్ల ఆశ్రమ గిరిజన పాఠశాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలకు వెళ్లిన కలెక్టర్ పిల్లల కోసం తయారుచేసిన ఆహార వంటకాలను పరిశీలించి మెనూ పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.