12-04-2025 12:52:07 AM
సిద్దిపేట, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): అకాల వర్షాలతో పంట నష్టం జరిగిన రైతు లు అధైర్య పడుద్దని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ సూచించారు.
శుక్రవారం సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ గ్రామంలో పంట పొలాలను మంత్రుల బృందం పరిశీలించారు రైతులతో మాట్లాడుతూ నష్టం జరిగిన ప్రతి రైతుకి నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు విషయాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులకు మేలు జరిగే విధంగా కృషి చేస్తామన్నారు సిద్ధిపేట జిల్లాలో అధిక శాతం నష్టం జరిగిందని రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాలలో పంట నష్టం వాటిల్లందని వెల్లడించారు.
జిల్లాలో 93 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా చేశామని అందులో 6400 ఎకరాల వారి 1200 ఎకరాల్లో మామిడి 16 ఎకరాల్లో కూరగాయల పంటలు నష్టం జరిగినట్లు జిల్లా కలెక్టర్ మన చౌదరి మంత్రు లకు వివరించారు. అనంతరం నంగునూరు మండలంలో నిర్మాణ దశలో ఉన్న ఆయిల్ ఫామ్ పరిశ్రమను సందర్శించి పరిశీలించారు పరిశ్రమ నిర్మాణం వేగవంతం చేయాలని ఆయిల్ఫామ్ పంటల విస్తీర్ణం పెంచడం పట్ల అధికారులకు తగిన సూచనలు చేశారు సిద్దిపేట ఆదర్శంగా ఉండాలని కావాల్సినన్ని నీటి వనరులు మంచి నేలలు ఈ ప్రాంతంలో ఉన్నట్లు మంత్రులు తెలిపారు. దేశంలోనే తెలంగాణలో నిర్మితమ వుతున్న ఆయిల్ పంప్ పరిశ్రమ రోల్ మోడల్ గా నిలుస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.