నిజామాబాద్,(విజయక్రాంతి): రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి(MLA Sudarshan Reddy) అన్నారు. సోమవారం నిజామాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు అనుకులంగా ప్రభుత్వ తీరును ఓర్వలేకనే బిజెపి, బీఆర్‌ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. సాగుచేసే ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ.12 వేలు, భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి రూ.12 వేలు, సన్నవడ్లు పండించే ప్రతి రైతుకు రెండు పంటలలో ప్రతి క్వింటాలుకు రైతు బోనస్, నిరుపేదలకు రేషన్‌కార్డులు, ఇండ్లులేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఈ నెల 26న అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. తమన ఉనికికి ప్రమాదమని తెలిసే బిజెపి, బిఆర్‌ఎస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అరెస్ట్ భయంతో ఆగమాగం మాట్లాడుతున్న కేటిఆర్ గత ప్రభుత్వం తప్పిదాల వల్లే ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. ఒక్కొక్క వ్యవస్థను సరిదిద్దుకుంటే రేవంత్‌రెడ్డి ముందుకెళ్తున్నారు. రేవంత్‌రెడ్డి పరిపాలనలో ప్రజల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు.