10-04-2025 01:45:34 AM
ఎమ్మెల్యే మురళీ నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 9 (విజయ క్రాంతి): అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందించి ఆదుకుంటామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ హామీ ఇచ్చారు.
బుధవారం మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని నెల్లికుదురు కేసముద్రం మండలాల్లో వడగండ్ల వర్షాలకు ఇండ్లు, పంటలు దెబ్బతిన్న బాధితులను ఎమ్మెల్యే పరామర్శించారు. వివిధ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, ఇండ్లను పరిశీలించారు. అధికారులు వెంటనే వడగండ్ల వర్షానికి జరిగిన నష్టం పై నివేదిక అందజేయాలని ఆదేశించారు.
బాధితులు ఎవరు కూడా అధైర్య పడకూడదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే వెంట కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంటా సంజీవరెడ్డి, ట్రాన్స్పోర్ట్ కమిటీ మెంబర్ రావుల మురళి, కాంగ్రెస్ నాయకులు గుగులోతు దసూరు నాయక్, అంబటి మహేందర్ రెడ్డి, అల్లం నాగేశ్వరరావు, బండారు వెంకన్న, కదిరే సురేందర్, శ్రీపాల్ రెడ్డి తదితరులున్నారు.