నిజామాబాద్ (విజయక్రాంతి): ఎండాకాలంలో డిమాండ్ కు తగ్గట్టుగా ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ లో నాణ్యమైన విద్యుత్ అందించడమే కాక ఎండాకాలంలో డిమాండ్ కు తగ్గట్టుగా విద్యుత్ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్తును ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎస్ఈ రాపల్లి రవీందర్ స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని పవర్ హౌస్ సబ్ స్టేషన్ లో ట్రాన్స్ఫార్మర్ను అదనంగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా చేసే సబ్స్టేషన్లో అంతరాయం ఏర్పడితే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే మరొక సబ్స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా చేసే విధంగా 1.50 కోట్ల రూపాయలతో 12.5 పవర్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.
గాజుల్పేట్, బర్కత్పురా, సాయి నగర్, సీతారాం నగర్ కాలనీ, ఆనంద్ నగర్, శివాజీ నగర్, న్యాల్కల్ రోడ్, నాగారం, ధర్మపురి హిల్స్, మాలపల్లి, బోధన్ రోడ్, ఖిల్లా రోడ్, శంభుని గుడి, హెడ్ పోస్ట్ ఆఫీస్, ఇందిరాపూర్, రేణుక నగర్ తదితర కాలనీల్లో ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీనివాసరావు, డీఈఎం వెంకటరమణ, ఏడీఈలు చంద్రశేఖర్, వీరేశం, నటరాజ్, ఏడీఈ కన్ స్ట్రక్షన్ తోట రాజశేఖర్, ఏఈ(పవర్ హౌస్) నగేష్, ప్రొటెక్షన్ ఏఈ భాస్కర్ ప్రసాద్, సాయిలు, ఎమ్మార్టీ ఫోర్ మన్ మక్సుద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.