calender_icon.png 19 November, 2024 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడువులోగా నివేదిక అందజేస్తాం

19-11-2024 12:24:30 AM

డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు 

మహబూబ్‌నగర్, నవంబర్ 18 (విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కల్పన నిమిత్తం ప్రభుత్వానికి నిర్దేశించిన గడువులోగా నివేదిక అందజే స్తామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను తెలుసుకునేం దుకుగాను బహిరంగ చర్చ నిర్వహించారు. వినతులను, అభ్యంతరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేస్తామని కమిషన్ చైర్మన్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రిన్సిపల్ కార్యదర్శి సైదులు, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్లు మోహన్‌రావు, శివేంద్రప్రతాప్ పాల్గొన్నారు.