calender_icon.png 21 November, 2024 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇస్తాం

21-11-2024 02:02:52 AM

  1. ఇప్పటివరకు ఐదు జిల్లాలో పర్యటించాం
  2. త్వరలోనే జిల్లాల పర్యటన పూర్తి చేస్తాం
  3. నేడు ఉమ్మడి వరంగల్‌లో బహిరంగ విచారణ
  4. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు

హైదరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వే షన్లు కేటాయించేందుకుగాను సమగ్ర నివేదిక ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బీ వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం డెడికేటెడ్ కమిషన్ కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, బీసీ మేధావుల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ బృందం ఇప్పటివరకు ఐదు జిల్లాల్లో పర్యటించి సమాచారం స్వీకరించిందని తెలిపారు. గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ నిర్వహిస్తున్నామని, ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని, తాము ఊహించిన దాని కంటే ఎక్కువ వినతిపత్రాలు వస్తున్నాయని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో పర్యటించి వివరాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కులగణన పూర్తి వివరాలు వచ్చిన తర్వాత బీసీలకు రాజకీయ రిజర్వేషన్లలో న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా నివేదికను అం దించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించా రు.

మంగళవారం బీజేపీ బీసీ సెల్ నాయకులు, వివిధ కుల సంఘాల నేతలు కమిష న్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. జనాభా లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కేటాయించాలని కోరారు. సమా వేశంలో డెడికేటెడ్ కార్యదర్శి బడుగు సైదులు, ఎంబీసీ చైర్మన్ అలోక్ కుమార్ పాల్గొన్నారు. 

జనాభా దామాషా ప్రకారం పెంచాల్సిందే.. 

తెలంగాణలో జరుగుతున్న సమగ్ర కులగణన ఆధారంగా జనాభా దామాషా ప్రకా రం బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రం గాల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్ డెడికేటెడ్ కమిషన్‌ను కోరారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలవుతున్నాయని..

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీలకు మాత్రం దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదన్నారు. కులగణన పూర్తి అయి న వెంటనే బీసీ కులాల లెక్కలను ప్రామాణికంగా తీసుకొని బీసీ రిజర్వేషన్లు పెంచా లని కోరుతూ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం అందించామని తెలిపారు.

 కుల్కచర్ల శ్రీనివాస్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్