11-02-2025 12:34:21 AM
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి): గ్రామాల సమగ్రాభివృద్ధికి సహక రిస్తానని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రానికి సమీపంలోని దిగిడిపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీలో ఆంజనే య స్వామి విగ్రహ ప్రతిష్ట, నవగ్రహ దేవత లను, ధ్వజ స్థంభం, బొడ్రాయి విగ్రహ ప్రతి ష్ఠ మహోత్సవానికి ఎమ్మెల్యే హాజరై ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు.
గ్రామానికి రక్ష ణగా నిలబడే ఆంజనేయ స్వామిని, గ్రామా న్ని కంటికి రెప్పలా కాపాడే బొడ్రయి ని కాలనీలో అంగరంగ వైభవంగా ప్రతిష్టించు కోవడం సంతోషదాయకంగా ఉందన్నారు. మంచి వాతావరణం లో ప్రతిష్టించుకొన్న ఈ ఆలయ ప్రాంగణంలో నిత్యం భక్తులతో కిటకిటలాడాలని, ఇక్కడ ప్రతిష్టించుకొన్న ఆంజనేయ స్వామి వారు భక్తుల కోరికలు తీర్చాలని,;స్వామి దర్శనం చేసుకొంటే మాన సిక ప్రశాంతత లభిస్తుందన్నారు.
ఈ దేవాల యం దేదీప్యమానంగా అభివృద్ది చెందాల ని, ఈ దేవాలయ అభివృద్ధి బాధ్యత నాది అన్నారు. రాబోయే రోజుల్లో ఈ దేవాల యాన్ని అందరం కలిసి మరింత అద్భుతం గా అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. అనంతరం వివిధ పాఠశాలలోని విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో కోస్గి శివప్రసాద్ రెడ్డి, సురేం దర్ రెడ్డి, చర్ల; శ్రీనివాసులు, జే.చంద్రశేఖర్, మురళి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాద వ్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ , మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.