27-03-2025 01:32:54 AM
మంత్రి రాజనర్సింహ
హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): విద్యా వ్యవస్థకు పునా దులైన ప్రీ ప్రైమరీ, ప్రైమరీ స్కూలిం గ్ వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రా జనర్సింహ పేర్కొన్నారు. బుధవా రం మండలిలో విద్యాశాఖపై జరిగి న చర్చలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లల సంఖ్య తగ్గడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దశాబ్దకాలంగా ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య తగ్గుతూ వస్తోందని, జీరో ఎన్‌రోల్‌మెం ట్ స్కూళ్ల సంఖ్య కూడా పెరిగిందన్నా రు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూ ళ్ల సంఖ్య పెరిగినా, చాలా పాఠశాలలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని, అన్ని వసతులు కల్పిస్తామన్నారు. 8 జూనియర్ కాలేజీలను ప్రారంభించామని, 1200 మంది లెక్చరర్లను నియమించామన్నారు. 12 వర్సిటీలకు వీసీలను నియమించినట్లు తెలిపారు.