03-03-2025 12:03:25 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 2 (విజయక్రాంతి) : ఆదివాసీలకు పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఏఎస్పీ చిత్తరంజన్ అన్నారు. ఆదివారం తిర్యాని మండలం గోవేన , కుర్సిగూడ, నాయకపుగుడా మారుమూల గ్రామాలను సందర్శించారు. గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు, శంభూ రావు బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఎఎస్పి త్వరలోనే వైద్యం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువతకు ఆట వస్తువులు అందజేశారు. చిన్నారులతో కలిసి ముచ్చటించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మావోయిస్టుల ప్రలోభాలకు లోను కావద్దని యువతకు సూచించారు. అపరిచిత వ్యక్తుల మాయ మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.
యువత మావోయిస్టులకు ఆకర్షితులు అయి జీవితాన్ని విచ్చిన్నం చేసుకోవద్దని ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. అసాంఘిక కార్యకలాపాలకు, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని తల్లిదండ్రులకు సూచించారు. విద్య, వైద్యం సహకారం కోసం పోలీసులను ఎల్లప్పుడూ ఆశ్రయించవచ్చని పోలీసులు మీకోసం లో భాగంగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. గంజాయి సాగు చేయవద్దని ఎవరైనా చేస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.ఆయన వెంట సిఐ బుద్దె స్వామి ,ఎస్సు శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.