సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
సూర్యాపేట, నవంబర్ 20 (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా లగచర్ల బాధితు లకు అండగా ఉంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మా ట్లాడారు. ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకించిన రైతులను నిర్భంధించి, బలవంతం గా భూముల సేకరణ చేయడం సరికాదన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. నేడు వామపక్షాలతో కలిసి లగచర్లకు వెళ్లి బాధిత రైతులను పరామర్శిస్తామన్నారు. సమస్యలు తెలుసుకుని సీఎం తో మాట్లాడాతామని తెలిపారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూ సేకరణ చేసినప్పుడు అక్కడి రైతులు వ్యతిరేకించినా బలవంతంగా సేకరణ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు రైతుల పక్షాన మాట్లడాటం విడ్డూరంగా ఉందన్నారు.
లగచర్లకు నాయకులు వెళ్లకుండా పోలీసులు ముళ్లకంచెలు వేసి ఆంక్షలు విధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు హానికరమన్నారు. సమావేశంలో నా యకులు చెరుపల్లి సీతారాములు, వీరయ్య, మల్లు లక్ష్మి, నాగర్జునరెడ్డి పాల్గొన్నారు.