calender_icon.png 9 January, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రపురి బాధితులకు అండగా ఉంటాం

07-01-2025 02:04:23 AM

ఆప్ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ సుధాకర్

ముషీరాబాద్, జనవరి 6: మణికొండ చిత్రపూరి కాలనీలోని బాధితులకు అండగా ఉంటామని ఆప్ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ తెలిపారు. సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్, సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డీజీ నర్సింహరావు, బాలరాజ్ , మురళీధర్ దేశ్ పాండే, చిత్రపూరి కాలనీ బాధితులు పాల్గొన్నారు.