24-04-2025 04:45:07 PM
నిర్మల్ (విజయక్రాంతి): అనుకోని కారణాల వల్ల అనారోగ్యం పాలై మృతి చెందిన కుటుంబాలతో పాటు ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు ఆదుకునేందుకు అండగా ఉంటామని డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు భరోసా ఇచ్చారు. గురువారం నిర్మల్ పట్టణంలోని కోరన్నపేటకు చెందిన రాజు శంకర్ వడదెబ్బతో మృతితే చందగా వారి కుటుంబాలను పరామర్శించారు. అలాగే సారంగపూర్ మండలంలోని కౌట్ల హకర్ పెళ్లి సారంగాపూర్ దాని తదితర గ్రామాల్లో ఆసుపత్రిలో చికిత్స పొందిన కుటుంబాలతో పాటు మరణించిన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ ఆది పార్టీ నాయకులు చిన్ను నల్లూరి పోశెట్టి రాజేశ్వర్ నరసయ్య గాజుల రవి తదితరులు ఉన్నారు.