calender_icon.png 16 January, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు అండగా ఉంటాం

07-12-2024 01:18:41 AM

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి

మహేశ్వరం, డిసెంబర్ 6: కందుకూరు మండల పరిధిలో ప్రభుత్వం నిర్మించతపెట్టిన ఫ్యూచర్ సిటీకి సబంధించి 330 ఫీట్ల రోడ్డు నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు అండగా ఉంటామని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం కొండా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అధికారు లు భూ సేకరణ చట్టానికి వ్యతిరేకంగా సర్వే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులు ఏవరూ అధైర్య పడొద్దని..మీ అందరికీ న్యాయం జరిగేవరకు బీజేపీ అండగా ఉంటుందని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మహేశ్వరం ఇన్‌చార్జి అందెల, మాజీ ఎమ్మెల్యే కెఎస్.రత్నం నాయకులు, రైతులు పాల్గొన్నారు.