calender_icon.png 5 January, 2025 | 9:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిత్రపురివాసులకు అండగా ఉంటాం

31-12-2024 02:14:43 AM

* ఆమ్ ఆద్మీ పార్టీ  రాష్ట్ర అధ్యక్షుడు దిడ్డి సుధాకర్

ముషీరాబాద్, డిసెంబర్ 30 : చిత్రపురి కాలనీలో జరిగిన అక్రమాలపై పోరాటం చేయడంతో పాటు బాధితులకు న్యాయం జరిగేంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ అండగా నిలబడుతుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. ఈ మేరకు సోమవారం ఫిలిం డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఫిలిం డివిజన్ ప్రజానాట్య మండలి కార్యదర్శి మద్దినేని రమేష్ బాబు ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ దిడ్డి సుధాకర్ మా  చిత్రపూరి కాలనీలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి గతంలో కో అధికారులుగా పనిచేసిన అందరికీ సంబంధాలున్నాయని, వారందరి మీద చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని అన్నారు.

చిత్రపూరి కాలనీలో 2005 మధ్యలో ట్యాంపరింగ్, 129 మార్ఫింగ్, అలాట్‌మెంట్స్, 1055 ఎక్స్‌ట్రా సభ్యత్వాలు, 250 ఫోటోస్‌లోని జాబితాలు, కోట్ల రూపాయల కుంభకోణాలు వీటన్నింటిపై ఓ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పక్షాలను పిలిచి చర్చించి, తప్పనిసరిగా బాధితులకు న్యాయం చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు విజయ మల్లంగి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి న్యాయవాది యమున గౌడ్, డాక్టర్స్ వింగ్ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష నాయుడు, అధికార ప్రతినిధి జావిద్ షరీఫ్, రామన్ స్వామి, పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.