calender_icon.png 7 February, 2025 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ కుటుంబానికి అండగా ఉంటాం

07-02-2025 01:40:35 AM

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంటకయ్య

సూర్యాపేట, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా కేం  కులాంతర వివాహం కారణంగా హత్యకు గురైన వండ్లకొండ కృష్ణ (మాల బంటి) కుటుంబానికి అండగా ఉంటామని ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య హామీ ఇచ్చారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామి ళ్లగ ఠ్డలో నివాసం ఉంటున్న కృష్ణ భార్య భార్గవి, ఆయన కుటుంబాన్ని వెంకటయ్య పరామర్శించారు.

ఈ సంద  కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. వెంకటయ్య మాట్లాడు  76 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇ  దుర్ఘటన జరగడం బాధాకరమన్నారు. హత్య కేసులో ఎంతటివారినైనా విడిచిపెట్టేది లేదన్నారు. చట్టప్రకారం వారందరికి శిక్ష పడేలా చూస్తామన్నారు.

కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులు వచ్చినట్లు కృష్ణ కుటుంబం తెలిపిందని తక్షణమే పోలీస్ ప్రొ  ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. ప్రభు  అందజేసే సంక్షేమ పథకాలు, ఇంట్లో ఒకరికి ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కేసు పక్కదారి పట్టకుండా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపించేలా చూస్తానన్నారు. అనంతరం దళిత సంఘాల నాయకులు అందజేసిన వినతి పత్రాన్ని స్వీకరించారు.