21-03-2025 01:39:53 AM
యాచారం మార్చి 20 : మండలం లో మొండి గౌరెల్లి గ్రామంలో పారిశ్రామిక పార్క్ పేరుతో భూసేకరణకు సం బంధించి విడుదలైన నోటిఫికేషన్ను వెంటనే రద్దు చేయిం చాలని ఆ గ్రామ రైతులు రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుం డా , ఏకపక్షంగా భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని రైతులు ఆయనకు వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ కమిటీ మాజీ చైర్మన్ సత్తూ వెంకట రమణ రెడ్డి, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కర్నాటి రమేష్ గౌడ్, పశ్చ బాషా, గ్రామస్థులు మేకల యాదగిరి రెడ్డి, మర్రిపల్లి అంజయ్య యాదవ్, బండిమీద కృష్ణ, తాండ్ర రవీందర్, సంగేమ్ రవి, కుంచరాపు సందీప్ రెడ్డి, ఏడెల్లి యాదయ్య, మాధం జంగయ్య, గుర్రం భాస్కర్ రెడ్డి, ఎలిమినేటి ప్రతాప్ రెడ్డి, మర్రిపల్లి బాలరాజు, నక్క బాలరాజ్, ఎలిమినేటి శ్రీనివాస్ రెడ్డి, కుంటి పాండు యాదవ్, పోరెడ్డి జంగారెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, ఎట్టి యాదయ్య, మరోజు శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.