calender_icon.png 17 April, 2025 | 6:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం

08-04-2025 12:58:31 AM

కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అర్వింద్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : ఆపదలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, వారి కుటుంబాలకు  అన్ని విధాలుగా అండగా ఉంటామని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. అర్వింద్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకు డు ఆవుల ప్రకాష్ సంతాపసభను ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు, ముఖ్యఅతిథిగా హాజరైన అరవింద్ కుమార్ యాదవ్ ఆయన చిత్రపటానికి పూలమాలలే వేసి నివాళులర్పిం చారు. అనంతరం మాట్లాడుతూ... ఆవుల ప్రకాష్ పార్టీ బలోపేతానికి, ప్రజాసమస్యల పరిష్కారానికి ఎంతో కృషిచేశారని కొనియాడారు.

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందేలా తన వంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆవుల ప్రకాష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెండం శ్రీనివాస్ యాదవ్, నగర కార్యదర్శి తమగొండ రాజ్ప్, నగర ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీకాంత్ గౌడ్, నాయకులు చారి, మురళీమోజేస్, రమేష్ గౌడ్, అమర్నాథ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.