26-01-2025 12:00:00 AM
మంత్రి సోదరుడు దుద్దిళ్ల శ్రీనుబాబు
మహదేవపూర్: బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు శ్రీనుబాబు అన్నారు. పలిమెల మండలం లోని నీలం పెల్లి, సర్వాయిపేట, బూర్గు గూ డెం, గ్రామాల్లోని ఇటీవల మృతి చెందిన కుటుంబాలను పరమర్శించారు.
మండల కాంగ్రెస్ నాయకులు బోర్కారి నారాయణ అనారోగ్యంతో ఉండటంతో వారిని పరామర్శించారు. మహాదేవపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోట రాజబాబు, మాజీ ఎంపీపీలు కుర్సం బుచ్చక్క, చిన్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీనివాస్, మండల నాయకులు పాల్గొన్నారు.