25-03-2025 11:16:54 PM
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు..
ఎల్బీనగర్: రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ హరీశ్ బాబు, ప్రమాదవశాత్తూ చనిపోయిన అంబర్ పేట ఆర్మ్డ్ హెడ్ క్వార్టర్ కానిస్టేబుల్ బాలకృష్ణ కుటుంబ సభ్యులకు ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో మంగళవారం అమరుల కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత చెక్కులను సీపీ సుధీర్ బాబు అందజేశారు.
కానిస్టేబుల్ హరీశ్ బాబు భార్య ప్రియాంకకు రూ. 3.99,160, ఇద్దరు మైనర్ పిల్లలకు చెరో రూ. 2 లక్షలు, బాలకృష్ణ తండ్రి సత్తయ్యకు రూ. 3.99160, తల్లి జయమ్మకు రూ. 3.99160 విలువైన చెక్కులను అందజేశారు. అమరుల కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకొని, వారికి రావాల్సిన పెన్షన్ త్వరగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మినిస్టిరియల్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమములో రాచకొండ అడిషనల్ డీసీపీ అడ్మిన్ శివకుమార్, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సిహెచ్. భద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.