calender_icon.png 31 January, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత కులాలకు అండగా ఉంటాం

30-01-2025 01:04:19 AM

  1. అందరివాటాను దోచుకున్న మాలలు
  2.  ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

ఎల్బీనగర్, జనవరి 29: రిజర్వేషన్లు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎస్సీవర్గాలకు అందరికీ చెందాల్సిన రిజర్వేషన్లను ఒక్క మాలలు మాత్రమే దక్కిం  తక్కువ జనాభా ఉన్న మాల  అధికంగా రిజర్వేషన్లు వినియోగించుకున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు.

ఎస్సీ వర్గీకరణ మాదిగ, మాదిగ ఉప కులాల రౌండ్ టెబుల్ సమావేశాన్ని బుధవారం ఎల్బీనగర్‌లోని ఒక హోటల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మందకృష్ణ మాదిగ హాజరై, మాట్లాడారు. ఇప్పటివరకు ఎస్సీ రిజర్వేషన్ల అమలుపై నియమించిన లోకూ  రామచంద్రన్, ఉషమెహ్రా కమిటీ నివేదికలన్నీ మాల కులస్తులే రిజర్వేషన్లను అధికంగా వినియోగించుకున్నట్లు స్పష్టం చేశాయన్నారు.

మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు ఎస్సీ వర్గీకరణకు 30 ఏండ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నామన్నారు. ఎమ్మార్పీఎస్ డిమాండ్ న్యాయబద్ధమైంది కాబట్టే సుప్రీంకోర్టు అంగీకరించి, చారిత్రాత్మక తీర్పు ఇచ్చినట్లు వివరించారు.

ఫిబ్రవరి 7న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘లక్ష డప్పులు-వెయి గొంతులు’ బహిరంగ సభకు లక్షలాది మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మేడి పాపయ్య, తూర్పాటి హన్మంతు, చింతల రాజలింగం, డాక్టర్ రాజమౌళి పాల్గొన్నారు.