calender_icon.png 4 February, 2025 | 6:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాయికుమార్ కుటుంబానికి అండగా ఉంటాం

04-02-2025 12:48:45 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

రాజేంద్రనగర్, జనవరి 3: సాయికుమార్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హామీ ఇచ్చారు. మంచిరేవుల గ్రామానికి చెందిన సి హెచ్ సాయి కుమార్ సంస్మరణ సభను బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.

40 రోజు సంతాప సభకు స్పీకర్ తో పాటు రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్,  చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పామేన భీమ్ భారత్ హాజరై సాయి కుమార్ కు నివాళులు అర్పించారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి 13 లక్షల రూపాయలు ఆర్ధిక సహాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో నార్సింగి మున్సిపాలిటీ మాజీ చైర్ పర్సన్ నాగపూర్ణశ్రీనివాస్, మాజీ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, విజయ్ ఆర్య, భీమ్ తదితరులు పాల్గొన్నారు.