19-03-2025 02:05:41 AM
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
కుమ్రం భీం ఆసిఫాబాద్ ,మార్చి18( విజయ క్రాంతి): పోలీస్ కుటుంబాలకు శాఖ తరపున అండగా ఉంటామని ఎస్పి డివి శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ బషీరుద్దీన్ కుటుంబ సభ్యులకు రూ: 2.20 లక్షల చెక్కుల మంగళవారం ఎస్పీ అందజేశారు.
సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖ పరంగా రావలసిన బెనిఫిట్ పూర్తిస్థాయిలో అందేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ కో ఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ అడ్మిన్ పెద్దయ్య, కో-ఆపరేటివ్ సొసైటీ కోఆర్డినేటర్ జాఫరోద్దీన్, ఆర్‌ఐఎంటి అంజన్న పాల్గొన్నారు.