calender_icon.png 18 April, 2025 | 9:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేవరకు అండగా ఉంటాం

25-03-2025 01:23:43 AM

బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు 

కొత్తగూడెం, మార్చి 24 (విజయక్రాంతి): కొత్తగూడెంలో  జర్నలిస్టులకు కేటాయించిన స్థలాన్ని వారికి ఇచ్చేంత వరకు నూటికి నూరు శాతం అండగా ఉంటామని పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఉద్ఘాటించారు...ఇండ్ల స్థలాల కోసం గత ఐదు రోజులుగా కొత్తగూడెంలో జర్నలిస్టుల చేస్తున్న నిరసన శిబిరాన్ని ఆయన సోమవారం  సందర్శించి జర్నలిస్టుల కు మద్దతు పలికి సంఘీభావం తెలిపారు. 

గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జర్నలిస్టుల సంక్షే మం కోసం  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ఆదేశించగా కొత్తగూడెంలోని గంగాభిషాన్ బస్తీలో( సింగరేణి మ్యాగ్జిన్) 10. 18ఎకరాల  స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు..  కొన్ని కారణాలవల్ల జాప్యం జరగడంతో ఈలోగా ఎలక్షన్స్ రావడం కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానంతో గద్దెనెక్కడం జరిగిందన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైనప్పటికీ జర్నలిస్టులకు ఇవ్వాల్సిన స్థలాన్ని ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మభ్యపెడుతున్నారన్నారు.

అయితే జర్నలిస్టుల కోసం కేటాయించిన స్థలాన్ని   ఎటువంటి షరతులు లేకుండా  అప్పగించాలని బీఆర్‌ఎస్ పార్టీ తరఫున డిమాండ్  చేశారు.. లేనిచో  స్థలాన్ని వాళ్ళకి అప్పగించేంతవరకు బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా వ్యాప్త ఆందోళనలు చేపడతామన్నారు... ఏది ఏమైనా అందరి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం కోసం కృషి చేసే జర్నలిస్టులు నేడు  సమస్యలతో  బాధపడుతున్నారని... ఈ పరిస్థితికి కారణమైన ప్రభుత్వ సిగ్గుతో తలదించుకోవాలని హితవు పలికారు. 

మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి చుంచుపల్లి మాజీ ఎంపీపీ భగవత్ శాంతి లక్ష్మీదేవి పల్లి టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు నాయకులు లావుడియా సత్యనారాయణ అనుదీప్ హుస్సేన్ తగరు రాజశేఖర్ పాల్గొన్నారు . బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిరసన శిబిరాన్ని సందర్శించి జర్నలిస్టులకు అండగా ఉంటామని ప్రకటించారు.. ఇండ్ల స్థలాల కోసం జర్నలిస్టులు దీక్షలు చేయాల్సింది రావడం ప్రభుత్వాల దుర్మార్గ పాలనకు అర్థం పడుతుందని అన్నారు.అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఎల్ హెచ్ పి ఎస్ వివిధ సంఘాల నాయకులు జర్నలిస్టులకు తమ మద్దతును తెలిపారు.