calender_icon.png 8 January, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు అండగా ఉంటాం

06-01-2025 12:00:00 AM

మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ 

మానకొండూర్, జనవరి 5: జర్నలిస్టు లకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ భరోసానిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల ప్రెస్ క్లబ్ నూ తన కమిటీ ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నిక వ్వగా, ఆదివారం జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన క మిటీ ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి, పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్క రించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ దూసేటి మహేందర్ రెడ్డి కాలం చేయగా, ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు.

తదనంతరం ఆయ న మాట్లాడుతూ ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉండే జర్నలిస్టులకు ఎన్నో సమ స్యలు ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం అరులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంద న్నారు. 

ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బత్తుల రాకేష్, ప్రధాన కార్యదర్శి బొట్టు శ్రీనివాస్,  ఉపాధ్య క్షులు నాగెల్లి ఆంజనేయులు, ఎండీ రహీం, గౌరవ అధ్యక్షుడు ముస్కు లక్ష్మారెడ్డి, జిల్లా ఈసీ మెంబర్ సిరిసిల్ల అనిల్, సలహా దారు వేల్పుల రాజు, కోశాధికారి ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శి కొంపల్లి సతీష్, బూమా డి శ్రీధర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి జాప నాగరాజు, లీగల్ అడ్వుజర్ మాతంగి రవి  కార్యవర్గ సభ్యులు తూముల శ్రీనివాస్, వి ష్ణు, విజయ్ కుమార్, రాజిరెడ్డి ని ఎమ్మెల్యేతో పాటు వెంకటేష్ విజయ క్రాంతి రిపోర్టర్ పలువురు మండల నాయకులు శాలువాలతో సత్కరించి, అభినందనలు తెలియజేశారు.